News

News

అహోబిలేశుని వసంతోత్సవం

కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వేసవితాపం తీర్చేందుకు, వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు. ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వసంతోత్సవ మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం...
News

ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు

ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులు, సిబ్బంది ఆమె...
News

చేపల పేరుతో గో మాంసం రవాణా అడ్డుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు

విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో 80 గోమాంస బాక్సులను నల్లగొండ స్టేషన్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులోని ముందు, వెనుక లగేజీ బోగీల్లో ఈ బాక్సులను గుర్తించారు. ఒక లగేజీ బోగీలో 40, మరో లగేజీ బోగీలో 40 బాక్సులను ఫిష్‌ లేబుల్‌ అంటించి సికింద్రాబాద్‌ తరలిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు స్టేషన్లలో రైలును ఆపేందుకు ప్రయత్నించారు. గుంటూరులో అడ్డుకున్న శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి, భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. విషయం నల్లగొండ జీఆర్పీ పోలీసులకు తెలియడంతో.. రైలు నల్లగొండ రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే తనిఖీ చేసి, గో మాంసం స్వాధీనం చేసుకున్నారు....
News

పాకిస్థాన్ లో యోగా తరగతులు

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా పాకిస్థాన్ లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. ఇస్లామాబాద్ రాజధాని అభివృద్ధి సంస్థ(సీడీఏ) ఇక్కడి ఎఫ్-9 పార్క్ లో ఉచిత యోగా తరగతులు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మంది...
News

10న దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మీయాగం

అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో 10వ తేదీ శుక్రవారం మహా లక్ష్మి యాగాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామరావు తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీగణపతి విగ్రహం వద్ద మహా లక్ష్మీ...
News

కశ్మీర్‌లో వాయుసేన జవాన్ల కాన్వాయ్‌పై కాల్పులు

జమ్మూకాశ్మీర్ లోని పూంఛ్‌ జిల్లాలో భారత వాయుసేన జవాన్ల వాహనశ్రేణిపై ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. బలగాలు సనాయ్‌టోప్‌లోని శిబిరానికి తిరిగొస్తుండగా సురాన్‌కోటె పరిధిలోని షాసితార్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6.15 గంటలకు ఉగ్రవాదులు కాల్పులతో తెగబడ్డారు. ఒక వాహనం విండ్‌ స్కీన్‌పై డజనుకుపైగా బుల్లెట్ల దాడి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఏకే రకం రైఫిళ్లతో దాడి చేసిన ఉగ్రవాదులు తర్వాత సమీప అడవిలోకి పారిపోయారు. గాయపడిన జవాన్లకు ఉధమ్‌పూర్‌లోని కమాండ్‌ ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. దాడి విషయం తెల్సి అప్రమత్తమైన సైన్యం, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రైఫిల్స్‌ బృందాలు అణువణువునా గాలిస్తున్నాయి. కాన్వాయ్‌ సురక్షితంగా ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని వాయుసేన ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేసింది....
ArticlesNews

భారత రాతి చిత్రాల పితామహుడు డా. వీఎస్ వాకన్కర్

( మే 4 - డా. వీఎస్ వాకన్కర్ జయంతి ) భారత్‌లో రాక్ ఆర్ట్ (రాతి చిత్రాల) పితామహుడిగా పేరొందిన ప్రముఖ ఆర్కియాలజిస్టు డాక్టర్ వీఎస్ వాకన్కర్. 2003లో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన భీంబేత్కా గుహలను కనుగొన్న అన్వేషి ఆయనే. 1919 మే 4వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలోని నీముచ్ టౌన్‌లో జన్మించిన విష్ణు శ్రీధర్ వాకన్కేర్… ఆర్కియాలజీ చదువుకొని భీంబేత్కా గుహల్లో ఉన్న రాతి చిత్రాలను గుర్తించారు. భోపాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో, వింధ్య పర్వతాల్లో ఉన్న ఈ గుహలను అప్పటి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ గుహల్లో ఉన్న చారిత్రక సంపదను 1957లో ప్రపంచానికి వాకన్కేర్ చూపించారు. ఈ ప్రాంతంలో ఏడు పర్వతాల్లో 500కుపైగా గుహలున్నాయి. ఈ గుహలను కనుగొన్న తర్వాత తన జీవితాన్ని రాతి చిత్రాలు...
News

శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు రూ. 16 లక్షల విలువ గల పరికరాలు అందజేత

భక్తుల కొంగుబంగారమైన శ్రీశైలంమల్లికార్జున దేవస్థానం వైద్యశాలకు ఓ భక్తుడు వైద్య పరికరాలను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. హెచ్‌ఈఎస్‌ ఇన్‌ ఫ్రా ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఐవీఆర్‌ కృష్ణంరాజు రూ. 16 లక్షల విలువగల వైద్యపరికాలను ఆలయ ఈవో డి....
1 1,506 1,507 1,508 1,509 1,510 3,061
Page 1508 of 3061