ఇస్లామేతరులను చంపమంటూ మసీదు నుంచి ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ డైమండ్ హార్బర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామం వదిలి వెళ్లకపోతే హిందువులను చంపేయమంటూ ఆదివారం నాడు స్థానిక మసీదు లౌడ్ స్పీకర్ ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
వెంటనే గ్రామంలో వార్తా ప్రసారాలు, ఇంటర్నెట్ కనెక్షన్లు నిలిపివేశారు. గ్రామానికి సంబంధం లేని బయటి వ్యక్తులతో పాటు పోలీసులు కూడా అక్కడ ప్రవేశించకుండా నిషేదాజ్ఞలు జారీ చేశారు.
డైమండ్ హార్బర్ లోక్ సభ నియోజకవర్గంలో మే 19న జరిగిన ఎన్నికలకు ముందు ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఉద్రిక్తతలు సమీప బిష్ణుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా పాకుతుండటంతో అక్కడి హిందువులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్నట్టు కొన్ని వార్త మాధ్యమాల ద్వారా సమాచారం అందింది.
స్వరాజ్య, మై నేషన్ వార్తా సైట్ల కధనాల ప్రకారం కొన్ని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా హిందువులు వలసవెళ్తున్న వీడియో దృశ్యాలు ఇంటర్నెట్ లో పోస్ట్ అయ్యాయి. “హిందువులను చంపేయమంటూ మసీద్ నుండి వచ్చిన పిలుపు” వలసలకు కారణమని మహిళలు, పిల్లలందరూ వెల్లడించినట్టు ఆయా పత్రికలు తమ కధనాల్లో పేర్కొన్నాయి.
Source: VSK Bharat