News

వందేమాతరం పూర్తిగా ఆలపించం కేరళ మంత్రి మురళీధరన్, కాంగ్రెస్ ఎంపీ ఉన్నితన్ వెల్లడి

4views

అధికారిక కార్యక్రమాల్లో వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించే విషయంలో కేరళలోని యూడీఎఫ్ సర్కార్కు స్పష్టత కొరవడింది. ఈ గేయాన్ని పూర్తిగా ఆలపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్ర టరీ సర్క్యులర్ జారీ చేయగా, అలాంటిదేమీ లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మం త్రి స్పష్టం చేయడం గమనార్హం. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించబోరని రాష్ట్ర మంత్రి కె.ము రళీధరన్, కాంగ్రెస్ ఎంపీ రాజ్మీహన్ ఉన్ని తన్ ఆదివారం తెలిపారు. ఈ విషయంలో గత సంప్రదాయమే కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎప్పట్లాగానే ఈ గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తారని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం, హర్ ఘర్ తిరంగా కార్యక్ర మాల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వందేమాతరం 150 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు అధికారిక కార్యక్రమాల్లో పూర్తి గేయాన్ని ఆలపించాలని కేరళ చీఫ్ సెక్రటరీ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఈ ఆదేశాలను సంపూర్ణంగా అమలు చేయాలని అందులో పేర్కొన్నారు.

అయితే, పాత విధానమే అమలవుతుందంటూ మంత్రి స్పష్టం చేశారు. పూర్తి గేయాన్ని ఆలపించే ప్రసక్తే లేదని ఎంపీ ఉన్నితన్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కాల్చి చంపుతానంటూ తమను బెదిరించినా సరే, జాతీయ గేయాన్ని పూర్తిగా ఆలపించబోమన్నారు. ఇప్పటి వరకు ఆలపిస్తున్న విధంగానే మొదటి రెండు చరణా లనే ఇకపైనా ఆలపిస్తామన్నారు. చీఫ్ సెక్ర టరీ బిశ్వనాథ్ సిన్హా ఈ నెల 6వ తేదీన పూర్తి గేయం ఆలపించాలంటూ జారీ చేసిన సర్క్యు లర్ విషయం తమకు తెలియదని ఇద్దరు. నేతలు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన సర్క్యులర్లు జారీ చేస్తూ ఉంటారని చెప్పారు. అయితే, ఆ ఆదేశాలను కేరళ పాటించబోదంటూ కుండబద్దలు కొట్టారు.. గవర్నర్ సమక్షంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో మాత్రం జాతీయ గేయాన్ని పూర్తిగా ఆలపిస్తామని చెప్పారు. గవర్నర్ పాల్గొనే కార్యక్రమాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ అమలవుతుందని మంత్రి మురళీధరన్ వివరించారు. కేరళలో మాత్రం కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ కు బదులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ అమలవుతుందని స్పష్టం చేశారు.