News

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

10.3kviews

దేవుడిని ప్రార్థించి భక్తులను తమ పాపాల నుంచి విముక్తం చేస్తామని చెప్పే పాస్టర్ల అఘాయిత్యాలు వెలుగు చూస్తున్న కొద్దీ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. క్రైస్తవ సంస్థలు, మిషనరీలు, ప్రభుత్వ వర్గాలు, కొన్ని మీడియా సంస్థలు ఎంత దాచాలని ప్రయత్నించినా పాస్టర్ల అకృత్యాలు మాత్రం నిత్యం వెళ్లడవుతూనే ఉన్నాయి.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జాషువా నిహార్ అనే ఓ పాస్టర్ దైవ కార్యమని చెప్పి ఓ 15 ఏళ్ల బాలికపై గత మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సదరు పాస్టర్ పై పోక్సో, కిడ్నాప్, రేప్ కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.

విషయం తెలుసుకున్న స్థానికులు పాపాలు తొలగిస్తానంటూ ప్రార్థనలు చేసే పాస్టరే ఇలాంటి పాపిష్టి పనులకు పాల్పడడం ఘోరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.