సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వెలువడింది, ఇటీవల నిర్వహించిన వెబ్నార్లో ఒక వామ పక్ష సంస్థ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జనం టీవీ విడుదల చేసిన ఒక వీడియోలో, కేరళను స్వతంత్ర దేశంగా మార్చాలని వామపక్ష కార్యకర్తలు పిలుపివ్వడం కనిపిస్తోంది.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని, అయితే, వారు ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని బసేంద్ర బాబు అనే ఓ వామపక్ష కార్యకర్త చెప్పడం ఆ వీడియోలో కనిపిస్తుంది. అదే కనుక కొనసాగితే, కేరళకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని, స్వతంత్ర దేశంగా పరిగణించాలి అని ఆయన పేర్కొన్నాడు.
వెబినార్ యొక్క అంశం ‘ రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం’. భసురేంద్ర బాబు తన ప్రసంగంలో అయోధ్యలో పునాది రాయి వేయడం గురించి చర్చించారు. భారతదేశంలో హిందుత్వాన్ని ప్రోత్సహించడం, స్వతంత్ర భారతదేశం యొక్క ప్రాథమిక విలువలను మార్చడం అనే ఆర్‌ఎస్‌ఎస్ అజెండాలో ఇది ఒక భాగమని భసురేంద్ర అభిప్రాయపడ్డారు.
భసురేంద్ర బాబు మాట్లాడుతున్న వీడియోని కూడా ఈ క్రింద చూడవచ్చు :
Source : Indus Scrolls press.