అఖిల భారతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రారంభం ఆంధ్రప్రదేశ్ నుంచి చేసాం. దేవాలయాలను హిందూ సమాజానికి రాష్ట్రప్రభుత్వాలు అప్పగించాలంటే ఆ మేరకు హిందూ సమాజం సిద్ధపడాలి, రాష్ట్రప్రభుత్వాలు...
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రభల ఉత్సవానికి బుధవారం అధిక సంఖ్యలో జనం పోటెత్తారు. ఏకాదశ రుద్రులు ఒకేచోట కొలువైన అపురూప దృశ్యం చూసి తన్మయత్వంతో పులకించారు. 450 ఏళ్ల చరిత్ర ఉన్న వేడుకకు దేశంలోని వివిధ...
మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగరాజ్‌లో ఏర్పాటుచేసిన శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు నిర్వహించారు. శ్రీవారి నిత్య కైంకర్యాల తరహాలో ఉదయం తిరుప్పావై, తోమాల సేవ, కొలువు, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను...
తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కైంకర్యాలు పూర్తయ్యాక శ్రీమలయప్పస్వామి, శ్రీకృష్ణస్వామి తిరుచ్చిలపై పార్వేట మండపానికి చేరుకున్నారు. అక్కడ పూజాది క్రతువులు నిర్వహించాక శ్రీమలయప్పస్వామి వేటకు బయలుదేరారు. స్వామి తరఫున అర్చకులు ఈటెను మూడుసార్లు...
నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్లు) టికెట్లతో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొందరు దళారులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. అనుమానం వచ్చిన తిరుమల...
ఏటా సంక్రాతి పూట అయ్యప్ప భక్తులతో పాటు కోట్ల మంది హిందువులు ఆసక్తిగా ఎదురుచూసే మకర జ్యోతి దర్శనం పూర్తయ్యింది. స్వయంగా అయ్యప్ప స్వామే జ్యోతి రూపంలో ప్రత్యక్షమై.. తన కొండకు వచ్చిన భక్తుల్ని కటాక్షిస్తాడని నమ్మకం. అందుకే.. ఎన్నో కష్టాలకు...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వేదికగా ప్రారంభమైన ‘మహా కుంభమేళా’కు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం మకర సంక్రాంతి పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి....
భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో మూడు అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లను బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరై.....