News

కన్వర్ యాత్రికులకు సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు

25views

హరిద్వార్ : శ్రావణ మాసం రాగానే హరిద్వార్ భక్తి సాగరంగా మారిపోతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది శివభక్తులు కావడీలతో పవిత్రమైన గంగా జలాన్ని తీసుకొని, తమ తమ గ్రామాల వైపు సాగుతుంటారు. నిరంతరం బమ్ బమ్ భోలే, హర హర మహాదేవ్ అంటూ స్మరణ చేస్తూనే ముందుకు సాగుతుంటారు.

ఈ నేపథ్యంలో శివ భక్తులకు, కన్వర్ యాత్ర నేపథ్యంలో ఆరెస్సెస్ స్వయంసేవకులు, సేవా భారతి కార్యకర్తలు , వైద్యులు, ఫార్మాసిస్టులు కలిసి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హరిద్వార్‌లోని సింహద్వార్, జట్వాడా పుల్ జ్వాలాపూర్ మరియు బహాదరాబాద్ టోల్ ప్లాజా వద్ద ఉన్న సేవా కేంద్రాల ద్వారా శివభక్తులకు భోజనం, మంచి నీరు, ఆరోగ్య సేవలు, ప్రథమ చికిత్స, విశ్రాంతి మరియు అవసరమైన సహాయక ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతిరోజూ సుమారు రెండు నుండి మూడు వేల మంది శివభక్తులకు ఏదో ఒక రూపంలో సేవలు అందుతున్నాయి. సంఘ శాఖలలో లభించే సంస్కారాలు సమాజంలోకి వచ్చినప్పుడు సేవా రూపం దాలుస్తాయి. సేవ ద్వారా సంబంధాలు పెరుగుతాయి, సంబంధాల ద్వారా ఆత్మీయత పుడుతుంది, ఆత్మీయత ద్వారా సమన్వయం ఏర్పడుతుంది మరియు సమన్వయం ద్వారా సమాజంలో సామూహిక శక్తి జాగృతమవుతుంది. ఒక స్వయంసేవకుడికి సేవ అనేది ఎవరికీ చేసే ఉపకారం కాదు, సమాజం పట్ల తన బాధ్యతను నెరవేర్చుకునే ఒక అవకాశం.