ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

3.1kviews

రోనా నివారణ మరియు నిర్మూలనకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని ఆయుర్వేద వైద్యులు శ్రీ ఆనందయ్య తయారుచేసి ప్రజలకు ఉచితంగా పంచుతున్న ఆయుర్వేద మందు తయారీకి కావలసిన అనుమతులు సంపాదించడంలోనూ, మందు తయారీలోనూ, పంపిణీలోనూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహకారం పూర్తిగా ఉంటుందని ఆర్ ఎస్ ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు ప్రకటించారు.

ఈరోజు ఉదయం శ్రీ బయ్యా వాసు తో పాటు ఆర్ ఎస్ ఎస్ నెల్లూరు జిల్లా సంఘటనా కార్యదర్శి శ్రీ నవీన్, జిల్లా కార్యవాహ శ్రీ సుభాష్, జిల్లా సహ కార్యవాహ శ్రీ మల్లికార్జున రెడ్డి, ముత్తుకూరు ఖండ కార్యవాహ శ్రీ ప్రతాప్ రెడ్డి తదితరులు ఆయుర్వేద వైద్యులు శ్రీ ఆనందయ్య గారిని సందర్శించి ఆయన మందు తయారు చేస్తున్న విధానాన్ని, దాని పనితీరును, సాధించిన ఫలితాలను విచారించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీ బయ్యా వాసు మీడియాతో మాట్లాడుతూ ఏదైనా ఒక విషయం శాస్త్రీయంగా నిరూపితం కాకపోయినంత మాత్రాన అందులో శాస్త్రీయత లేనట్లా? అని ప్రశ్నించారు.

న్యూటన్ భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని తెలుపక ముందు భూమ్యాకర్షణ లేదా? ప్రతి చర్యకూ సమానమైన ప్రతిచర్య ఉంటుందన్న బోర్ సిద్ధాంతం వెలువడక ముందు సృష్టిలో చర్యకు ప్రతిచర్య లేదా? అని ఆయన ప్రశ్నించారు.

ఈ మందు స్వీకరించిన వారికి ఎందరికో జబ్బు నయమయిన దృష్టాంతాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నా, ఎలాంటి దుష్పరిణామాలూ లేవని తెలుస్తూ ఉన్నా అనుమతులు లేవన్న సాకుతో ప్రభుత్వం ఆ మందు పంపిణీని అడ్డుకోవడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

శ్రీరామనవమి నుండి సుమారుగా 20,000 మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కనీసం మాస్క్ కూడా లేకుండా శ్రీ ఆనందయ్య గారు వైద్యం చేశారని, తను గాని తన కుటుంబ సభ్యులు గాని కరోనా బారిన పడలేదని, ఆనండయ్య గారి ఆయుర్వేద మందు అద్భుతంగా పనిచేస్తున్నదన్న విషయానికి ఇంతకంటే నిదర్శనమింకేమి కావాలని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి కరోనా రోగులకు ఎంతో ప్రయోజనం కలిగించే సదరు ఆయుర్వేద ఔషధ పంపిణీకి మార్గం సుగమం చేయాలని ఆయన సూచించారు.

ఆయుర్వేదం, అలోపతి, హోమియో ఇలా ఈ వైద్య విధానంలోనైనా ఇప్పటివరకూ కరోనాకు ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలోనే వైద్యం చేస్తూ ఉన్నారని, ఏ పద్ధతి కూడా పూర్తి ప్రామాణికమైనది కాదని ఆయన పేర్కొన్నారు.

డబ్ల్యూహెచ్ఓ అనుమతి పొందిన ప్లాస్మా వైద్య విధానం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని తేలింది కదా? డబ్ల్యూహెచ్ఓ అనుమతి పొందిన రెమిడిసివర్ ఇంజక్షన్ వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని తేలింది కదా? అని ఆయన ప్రశ్నించారు.

అలోపతిలో అసలు దుష్ఫలితాలు లేని మందులే లేవని ఆయన పేర్కొన్నారు. కరోనా వ్యాధి చికిత్సలో వాడుతున్న స్టెరాయిడ్స్ వల్ల రోగుల యొక్క షుగర్ లెవెల్స్ అధికాధికమవుతున్న సంగతిని ఆయన గుర్తు చేస్తూ…. అత్యంత ప్రాణాపాయ స్థితిలో అంబులెన్స్ లో వచ్చిన రోగులు కూడా కోలుకునేలా చేస్తున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఆయుర్వేద మందును అడ్డుకోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

కనుక ఆర్ఎస్ఎస్ వైపునుంచి అన్ని విధాలుగా తాము సహకరిస్తామని, వేగంగా అనుమతులు పొందడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఆయుర్వేద మందు పంపిణీకి అవసరమైన అనుమతులు ఇప్పించాలని, అడ్డంకులు తొలగించాలని కోరారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.