News

అమెరికాలో జాతి వివక్ష చావలేదా?

12.2kviews

వివేక్ రామస్వామి.. అమెరికాలో స్థిరపడిన భారతీయుడు. పోనీ భారతీయ సంతతికి చెందినవాడు. రిపబ్లికన్ పార్టీ నాయకుడు. ఈసారి అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేద్దామనుకుని, పరిస్థితి అనుకూలించక మొన్న జనవరిలో ప్రచారం నిలిపివేశారు. నిజం చెప్పాలంటే అమెరికాలో ఇప్పటికీ చాలావరకు ప్రభావం చూపుతున్న జాతి వివక్ష ఉంది. ఆ సంగతి రామస్వామి ప్రచారంలో బయటపడింది. ‘మిగిలిన అభ్యర్థుల అభిప్రాయాలతో కంటే, మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలతోనే నేను ఎక్కువ ఏకీభవించగలను. అయినా నేను మీకు ఓటు వేయలేదు. ఎందుకంటే మీలో భారతీయ వారసత్వం కనుక’ అని తేల్చి చెప్పింది ఆన్ కోటర్ అనే రచయిత్రి. రామస్వామి గురించి ఇటీవల ఆమె మాట్లాడుతూ ట్రూత్ పాడ్ కాస్ట్ లో ఈ విషయాలు చెప్పిందామె. రామస్వామి తల్లిదండ్రులే ఏనాడో అమెరికా వలస వెళ్లిపోయారు. ఆన్ మాటలకు వారేమీ ఆవేశ పడలేదు. పైగా ఇంత నిర్భయంగా నిజం చెప్పినందుకు ధన్యవాదాలు అన్నారు.