
CAA పై ముస్లింలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్
షియా ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్ సీఏఏకు మద్దతు తెలిపారు. ముస్లింలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఏఏ, ఎన్‌ఆర్‌సీ రెండు వేర్వేరు అని తెలిపారు. ఎన్‌ఆర్‌సీ ప్రస్తుతం అసోంలో మాత్రమే అమలు అవుతుందని దేశవ్యాప్తంగా కాదని తెలిపారు. “దీనిపై పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ముస్లింలు సంయమనం పాటించాలని కోరుతున్నా” అని ఆయన అన్నారు.
1100ల మంది ప్రొఫెసర్ల మద్దతు
మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న 1100 మంది ప్రొఫెసర్లు సీఏఏకు మద్దతుగా ప్రకటన విడుదల చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తాము సమర్థిస్తున్నట్టు తెలిపారు. పలు యూనివర్శిటీల అధ్యాపకులు, యూజీసీ సభ్యులు ఆ ప్రకటనపై సంతకాలు చేశారు. అంతేకాకుండా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. “పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న వారిని ఆదరిస్తే తప్పేంటి?” అని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని, బిల్లును ఆమోదించిన పార్లమెంటును అభినందించారు. నిజా నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మేధావులు సూచించారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.