Newsvideos

వణుకుతున్న హిందూపురం

2.6kviews

హిందూపురం లోని మసీదుల్లో 140 మంది తబ్లిగీలు ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్నాయి. హిందూపురం లోని మక్కిడి పేటలో గల మసీదులో 21 మంది తబ్లిగీలు దాక్కుని ఉన్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్ళిన ఆరోగ్య మరియు పోలీసు సిబ్బంది వైద్య పరీక్షల నిమిత్తం వారి వద్ద నుంచి రక్త నమూనాలు సేకరించారు. తదుపరి వారిని క్వారంటైన్ కి తరలించడానికి ఆ మసీదు వద్ద కు వెళ్లగా ఆ 21 మంది గల్లంతైనట్లు సమాచారం. వారి గురించిన వివరాలను చెప్పవలసిందిగా స్థానికులను కోరగా వారు ఆ సిబ్బందిని తమ ప్రాంతంలోకి రానివ్వకుండా నిరోధిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లుగా సమాచారం. మసీదుకి చుట్టుపక్కల ఉన్న ఒక డాబా మీది నుంచి తన మొబైల్ ద్వారా వీడియో చిత్రీకరించిన వ్యక్తి పైన దాడి చేసి అతని మొబైల్ను ధ్వంసం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.

మక్కిడి పేటలోనే కాకుండా నగరంలోని వివిధ మసీదులలో సుమారు 120 మంది తబ్లిగీలు తలదాచుకుంటున్నట్లుగా సమాచారం. అయితే పోలీసులు కానీ, వైద్య సిబ్బంది కానీ ఆ మసీదులలోకి వెళ్లకుండా స్థానికులు వారిని నిరోధిస్తున్నట్టుగానూ, బెదిరిస్తున్నట్లుగానూ తెలుస్తోంది. దీంతో హిందూపురంలోని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు ఈ పరిస్థితిపై వెంటనే దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.