News

10న దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మీయాగం

282views

అక్షయ తృతీయను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో 10వ తేదీ శుక్రవారం మహా లక్ష్మి యాగాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామరావు తెలిపారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీగణపతి విగ్రహం వద్ద మహా లక్ష్మీ యాగాన్ని నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. యాగంలో పాల్గోనే ఉభయదా తలు రూ. 1000 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సేవలో పాల్గొనే ఉభయదాతలకు శేష వస్త్రం, రవిక, పెద్ద లడ్డూ, చక్రపొంగలి, పులి హోర ప్యాకెట్ను ప్రసాదంగా అందజేస్తారు. ఇక 12వ తేదీ శంకర జయంతిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రావిచెట్టు వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్యుల విగ్రహానికి ఆలయ అర్చకులు అభిషేకాలు, పూజా కార్యక్ర మాలను నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు నగరోత్సవ సేవ జరుగుతుంది.