స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 33 ; గరిమెళ్ళ సత్యనారాయణ
స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో తెలుగునాట ఖద్దరు వస్త్రధారులైన కాంగ్రెసు స్వచ్చంద శివకులు మువ్వన్న జెండాను ఎగురవేసుకుంటూ ముక్తకంఠంతో 'మా కొద్దీ తెల్ల దొరతనం, సైతాను ప్రభుత్వ వచ్చి అన్యాయకాలంబు దాపురించిందిపుడు" మొదలైన గీతాలు పాడుతూ ఉండేవారు. ఆ గీత...






