
0views
భారత్ మరో కీలక క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది .
ఈ ప్రయోగాన్ని స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరీక్ష సందర్భంగా క్షిపణికి సంబంధించిన అన్ని ఆపరేషనల్, సాంకేతిక ప్రమాణాలను విజయవంతంగా అందుకున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అగ్ని శ్రేణి క్షిపణులు భారత వ్యూహాత్మక రక్షణ సామర్థ్యంలో కీలకమైనవి. అగ్ని-4 సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి.





