News

లక్ష్మణుడి గుడిలో సర్వే

450views

ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో తీలేవాలి మసీదు ఉంది. గోమతి ఒడ్డున లక్ష్మణ్ తీలే (దిబ్బ) మీద అది ఉంది. ఇదేమీ వింత కాకపోవచ్చు కానీ, దీని వెనుక ఒక మంచి చారిత్రక వాస్తవం ఉంది మరి! ఆ మసీదు ప్రాంగణంలోనే శేషనాగేశ తిలేశ్వర్ ఆలయం ఉంది. ఈ మసీదులో కూడా సర్వే జరిపించాలని ఆదేశించవలసిందిగా కింది కోర్టును ఆశ్రయించవచ్చునని లక్నో జిల్లా కోర్టు కక్షిదారులకు పచ్చజెండా ఊపింది. ఇలాంటి సర్వేలు ఏమీ జరగకూడదంటూ ముస్లిం పక్షం వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. సున్నీ కేంద్ర వక్స్ బోర్డు అభిప్రాయం ప్రకారం 1991 నాటి ప్రార్థనాస్థలాల చట్టం ప్రకారం ఈ మసీదును యథాతథంగా ఉంచవలసిందే. సరిగ్గా ఈ విషయాన్నే జిల్లా కోర్టు తిరస్కరించింది. నిజానికి ఈ మసీదులో సర్వే జరిపించవచ్చునని సెప్టెంబర్ 25, 2017లోనే న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

లక్ష్మణ్ తీలాను నిర్మించినవాడు రాముడి సోదరుడు లక్ష్మణుడని హిందువులు కోర్టులో వాదించారు. ఇక్కడ పురాతన శేషనాగేశ్ తిలేశ్వర్ ఆలయం ఉండేదని వారి వాదన. ఇంకా కొన్ని హిందూ దేవీదేవతల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, వాటిని 2013లో ధ్వంసం చేశారని కూడా హిందువుల ఆరోపణ. ఆ సంవత్సరం వేసిన వ్యాజ్యంలోనే లక్ష్మణ్ తీలే మసీదులో సర్వే జరిపించాలని హిందువులు కోరారు. అక్కడ మసీదు నిర్మాణం కోసం భవ్యమైన హిందూ ఆలయాన్ని బెరంగజేబు కాలంలో కూల్చారని ఆ కేసులోనే హిందువులు పేర్కొన్నారు. మసీదు కట్టిన ఆ స్థలం హిందువులదని, కాబట్టి దాని అప్పగింతకు ఆదేశాలు ఇవ్వాలని హిందువులు వాదిస్తున్నారు. ఈ కేసును కూడా జ్ఞానవాపి, మధుర కేసులు వాదిస్తున్న న్యాయవాది హరిశంకర్ జైనే వాదిస్తున్నారు. అయోధ్యలో సర్వే జరిగింది. కాశీలో జరిగింది. ఇప్పుడు లక్నో వంతు,