
548views
పంజాబ్: పంజాబ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లను గుర్తించినట్టు సైనికాధికారి ఒకరు వెల్లడిరచారు. ఆ డ్రోన్లపై సాయుధ దళాలు కాల్పులు జరపగా.. తిరిగి పాక్‌వైపు వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు. డ్రోన్లు సంచరించిన ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది, దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. పంజాబ్‌లో కొన్ని రోజులుగా డ్రోన్ల సంచారం పెరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ హై అలర్ట్ ప్రకటించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు చాలా రోజులుగా పాక్ ప్రయత్నిస్తోందని.. వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు పంజాబ్ డీజీపీ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.
Source: EtvBharat





