News

ఛత్తీస్‌గఢ్‌ పాఠశాలల్లో గాయత్రీ మంత్ర పఠనం ఉత్తర్వుపై అభ్యంతరాల కొట్టివేత

6views

ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ గీతం, గేయాలతో పాటు సరస్వతీ వందనం, గాయత్రీ మంత్రం పఠించాలంటూ ఛత్తీస్‌గఢ్‌ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఆ ఉత్తర్వును కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధనను ప్రభుత్వం విధించలేదన్న విషయాన్ని జడ్జి అమితేంద్ర కిషోర్‌ ప్రసాద్‌ గుర్తు చేశారు. విద్యార్థుల విశ్వాసాలకు వ్యతిరేకంగా గురు మంత్రం, సరస్వతీ మంత్రం, గాయత్రీ మంత్రం పఠనాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఏమీ సర్క్యులర్‌లో చెప్పలేదనీ తెలిపారు. పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించలేదనే విషయాన్నీ గుర్తు చేశారు. ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌ను జడ్జి తోసిపుచ్చారు.