News

ఒడిశా రథయాత్ర, ఓనం సందర్భంగా 400 ప్రత్యేక రైళ్లు

27views
సుప్రసిద్ధమైన పూరీ జగన్నాథుని రథయాత్ర, కేరళ ఓణం పండగల సందర్భంగా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 400 కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రణాళికను కూడా ప్రకటించింది రైల్వే శాఖ.
జగన్నాథ రథయాత్ర కోసం 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుండగా, ఓణం పండుగ కోసం 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతారు. ఈ అదనపు సేవలు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రయాణించే యాత్రికులు, పర్యాటకులు మరియు పండుగలో పాల్గొనేవారికి సౌకర్యవంతంగా, భద్రంగా వుంటాయని రైల్వే తెలిపింది.
ప్రతి యేటా జరిగే అత్యంత ప్రసిద్ధమైంది పూరీ రథయాత్ర. భక్తులు కూడా కొన్ని లక్షల్లో తరలి వస్తారు. ఈ సమయంలో ఒడిశాకు వచ్చి పోయే ప్రయాణికుల భద్రత, ప్రయాణం సాఫీగా సాగేలా రైల్వే ప్రణాళికలు రచించింది.
అదేవిధంగా, కేరళ యొక్క అతిపెద్ద వార్షిక పండుగ అయిన ఓనం సందర్భంగా, ప్రజలు తమ కుటుంబాలతో కలిసి వేడుకలు జరుపుకోవడానికి సొంత ఊళ్లకు తిరిగి వెళ్లడంతో ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించారు.