News

ఆంధ్రప్ర‌దేశ్‌లో అరాచకం.. హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక ప్రచారం!

1.1kviews
  • అడ్డుకున్న ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు, ఆల‌య ఈవో

క‌ర్నూలు: ఆంధ్రప్ర‌దేశ్‌లో రోజు రోజుకూ హిందూ వ్య‌తిరేకుల‌ అరాచకం పెరిగిపోతోంది. తాజాగా, క‌ర్నూలు జిల్లా, పాణ్యం మండ‌లంలో హిందూ వ్య‌తిరేకులు బ‌రి తెగించారు. వారి మాట‌ల‌కు ఆద‌ర‌ణ లేక‌నో లేక వారికి మ‌తి లేక‌నో తాము అంటించుకున్న మతాన్ని హిందువుల‌కు అంట‌గ‌ట్టేందుకు కొత్త ఎత్తుగ‌డ వేశారు. దుర్గా భోగేశ్వ‌రంలోని హిందూ దేవాల‌యం వ‌ద్ద గురువారం ఏకంగా హిందూ దేవుళ్ళ ముసుగులో హిందూ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌ ప్ర‌చార దుకాణమే తెరిచారు.

బ్రహ్మకుమారి ఈశ్వరి పేరుతో క‌ర‌ప్ర‌తాలు, జెండాలు పెట్టి, చ‌ట్ట వ్య‌తిరేకంగా ప్ర‌చారానికి పాల్ప‌డ్డారు. శివుడు వినాశనకారీ అని, క్రీస్తు, అల్లా lite of God అని ఫ్లెక్సీల‌ రూపంలో వాళ్ళ ఫొటోస్ పెట్టి తిలకధారణ లేకుండా తెల్లటి వస్త్రధారణతో ప్ర‌చారం మొద‌లెట్టారు. ఈ సంత సంగ‌తిని ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న స్థానిక ధ‌ర్మ‌జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు అక్క‌డికి చేరుకుని, నిల‌దీశారు. ప‌స‌లేని వాద‌న‌ల‌తో కాలం గ‌డిపేందుకు య‌త్నించారు.

అయితే, ధ‌ర్మ జాగ‌ర‌ణ ప్ర‌తినిధులు గ‌ట్టిగా హెచ్చ‌రించ‌డంతోపాటు ఆ దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈవో హెచ్చ‌రిండంతో వారు త‌మ ప్ర‌చార దుకాణాన్ని మూసివేసి, అక్క‌డ నుంచి జారుకున్నారు. ఈ నిర‌స‌న‌లో ధ‌ర్మ‌జాగ‌ర‌ణ విభాగ్ ప్ర‌ముఖ్ రాం ప్రసాద్, చెన్నకేశవ పరియోజన ప్రముఖ్ రామ నరసింహులు, ఎల్లి శెట్టి మల్లికార్జున, శంకరయ్య, ప‌లువురు శివ‌భ‌క్తులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి