News

ధ‌ర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు

722views

నంద్యాల‌: నంద్యాల నగరంలోని స్థానిక గణపతి ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం, మహానంది రోడ్డు నందు శివరాత్రి సందర్భంగా మట్టితో తయారు చేసిన శివలింగనికి పూజలు చేశారు. ప్రధాన వక్త డాక్ట‌ర్‌ గెలివి సహదేవుడు మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని, మన సంస్కృతీ సంప్రదాయాలు, పండుగలను వివరించారు. తదనంతరం శివుని ఆకారంలో ఏర్పాటు చేసిన 1008 ప్రమిదలను, సతీ సమేతంగా 58 మంది దంపతులు వెలిగించి, తదుపరి ఇక్కడి సాంప్రదాయం మేరకు అగ్ని గుండంలో నడిచారు.

పొన్నాపురంలో…

పొన్నాపురం గ్రామం ఎస్సీ కాలనీలో నాగుల కట్ట వ‌ద్ద భజన కార్యక్రమం నిర్వహించారు. జగజ్జనని నగర్ గురుస్వాములు శ్రీ శ్రీనివాసులు శ్రీ రవి, వారి బృందం సభ్యులకు ఘ‌నంగా స‌త్క‌రించారు. అనంత‌రం డోలక్ ను బహుమతిగా ప్ర‌దానం చేశారు. అలాగే గోస్పాడు మండలం ధర్మ జాగరణ ఆధ్వర్యంలో జూలేపల్లి గ్రామంలో రాత్రి 12 గంటలకు పార్వతీ పరమేశ్వరులకు అభిషేకాలు, విశేష పూజ‌లు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి