
30views
ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం ఢిల్లీ విజయోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపకులు భగవద్ రామానుజాచార్యులు ఢిల్లీ బాద్‌షాను తన పాండిత్యంతో మెప్పించిన సందర్భంగా ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజున శ్రీవైష్ణవ ఆలయాల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా భగవద్ రామానుజాచార్యుల ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి ఆలయ బేడా మండపంలోని హంసవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం వైభవ పారాయణం నిర్వహించి, పల్లకీ సేవతో బేడా తిరువీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.
ఆలయ స్థానాచార్యులు టి.పి. రాజగోపాల్, ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు ప్రత్యేక పూజలు, ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించారు.





