
517views
ఆఫ్గనిస్థాన్ లో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక భేటీ నిర్వహించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, ఢిల్లీ చేరుకున్న అఫ్గాన్ భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ సమావేశంలో పాల్గొన్నారు. అఫ్గాన్ లో తలెత్తిన పరిణామాలు, తదితర అంశాలపై ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించినట్టు సమాచారం.





