Programms

‘‘శాంతా క్లాస్’’ విషయంలో బలవంతం చేస్తే ఊరుకోం : రాజస్థాన్ ప్రభుత్వం హుకూం

35views
క్రిస్మస్ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం అత్యంత కీలకమైన ఆదేశాలిచ్చింది. విద్యార్థులను శాంతాక్లాస్ లాగా దుస్తులు ధరించమని ఏ పాఠశాలా బలవంతం చేయవద్దని ప్రైవేటు పాఠశాలలకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. విద్యార్థులను బలవంతం చేయడం, లేదా తల్లిదండ్రులను అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనమని, ఒత్తిడి చేయడం కూడా కుదరదని, అలా ఏ పాఠశాలలైనా చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తేల్చి చెప్పింది.
పాఠశాలలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి స్వేచ్ఛగా ఉన్నప్పటికీ, కార్యక్రమాల్లో పాల్గొనే విషయంలో మాత్రం పూర్తిగా వారి స్వేచ్ఛకే వదిలేయాలని కూడా పేర్కొంది. ద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులపై ఏదైనా బలవంతం చేసినా, అది విద్యా నియమాల ఉల్లంఘనే అవుతుందని, పాఠశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని కూడా స్పష్టం చేసింది.”ఏదైనా పాఠశాల విద్యార్థులను బలవంతం చేస్తున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయి” అని అధికారిక ఉత్తర్వులో పేర్కొంది.
క్రిస్మస్ రావడమే ఆలస్యం.. జిల్లాలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు పిల్లలను శాంతాక్లాజ్ లాగా దుస్తులు ధరించమని బలవంతం చేస్తున్నాయని, దీని వల్ల క్రైస్తవేతర నేపథ్యాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని భారత్ – టిబెట్ సహయోగ్ మంచ్ కూడా పేర్కొంది.