News

పంచాంగం ఆవిష్క‌రణ

71views

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.ర‌విచంద్ర‌తో కలిసి ఆవిష్క‌రించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పంచాంగాన్ని ఆవిష్క‌రించారు.ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో శ్రీ ప‌రాభవ నామ సంవ‌త్స‌రంలో మనందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సకల ఐశ్వర్యాలు సమకూరాలని ఆకాంక్షిస్తున్నాట్లు చెప్పారు. ధర్మప్రచారంలో భాగంగా టిటిడి ప్రతి ఏడాదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నాటికి పంచాంగాలను ముద్రించి భక్తలోకానికి అందిస్తున్నట్లు తెలిపారు. 75రూపాయల గల ఈ పంచాంగం తిరుమల, తిరుపతిలో భక్తులకు అందుబాటులో ఉంటుందని..మిగతా టిటిడి సమాచార కేంద్రాలలో వచ్చే వారం నుండి పంచాంగం అందుబాటులోకి వస్తుందన్నారు.