NewsSeva

సేవా స్ఫూర్తిని చాటిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు

305views

నంద్యాల జిల్లా, స్థానిక విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాల టిబి విభాగం అధికారి శ్రీ బోరెడ్డి నాగార్జున రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి, భారత్ మాతా చిత్రపటానికి మాలార్పణ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. వెంకటేశ్వర కాలేజీ ప్రిన్సిపల్ శ్రీ చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి ఉదాత్తమైన కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు,

సదరు కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి, దక్షిణాంధ్ర ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ యర్రం విష్ణువర్ధన్ రెడ్డి, దక్షిణాంధ్ర ప్రాంత బజరంగ్దళ్ సంయోజక్ శ్రీ పోలేపల్లి సందీప్, దక్షిణాంధ్ర ప్రాంత విద్యార్థి ప్రముఖ్ శ్రీ కమ్మయ్య, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వైవి రామయ్య, నంద్యాల జిల్లా విశేష సంపర్క ప్రముఖ్ శ్రీ కాల్వ శేష సాయి, బజరంగ్ దళ్ నంద్యాల జిల్లా సంయోజక్ శ్రీ భోగిరెడ్డి నాగిరెడ్డి,బజరంగ్ దళ్ నంద్యాల జిల్లా సహా సంయోజక్ శ్రీ కమతం రాజశేఖర్ రెడ్డి, సహా సంయోజక్ శ్రీ నానుబాల వరప్రసాద్, జిల్లా సేవా ప్రముఖ శ్రీ శీలం మోహన్ కిరణ్, శ్రీ శీలం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో 63 మంది రక్తం దానం చేశారు. ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 63 మందిలో జగజ్జనని ప్రఖండ అధ్యక్షురాలు శ్రీమతి సుహాసిని , నలుగురు యన్ సి సి కాడెట్లు, శ్రీ శీలం మోహన్ కిరణ్, 8సంవత్సరాల బాబుకు యస్డీయఫ్ (సింగిల్ పెట్లేట్స్ డోనర్) ఇవ్వడం జరిగినది.