ఐరాస మాకు చెప్పాల్సిన అవసరం లేదు ; భారత్
దేశంలో ఎన్నికలపై ఐక్యరాజ్య సమితి సీనియర్ అధికారి ఇటీవల చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం తోసిపుచ్చారు. దేశంలో ఎన్నికలు ‘‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా’’ జరగాలని ఆ అంతర్జాతీయ సంస్థ తమకు చెప్పాల్సిన అవసరం లేదని దీటుగా బదులిచ్చారు. భారత్‌లో ప్రజల...







