
377views
దేశంలో ఎన్నికలపై ఐక్యరాజ్య సమితి సీనియర్ అధికారి ఇటీవల చేసిన వ్యాఖ్యలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం తోసిపుచ్చారు. దేశంలో ఎన్నికలు ‘‘స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా’’ జరగాలని ఆ అంతర్జాతీయ సంస్థ తమకు చెప్పాల్సిన అవసరం లేదని దీటుగా బదులిచ్చారు. భారత్‌లో ప్రజల ‘‘రాజకీయ, పౌర హక్కుల’’కు రక్షణ ఉంటుందని.. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని తాము ఆశిస్తున్నామని ఇటీవల ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా జైశంకర్ పైవిధంగా అన్నారు.





