News

అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం

494views

ల‌క్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టు ఉన్న మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదే విధంగా అక్కడ ఉన్న బెల్ట్ షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మధురలోని 37 మద్యం దుకాణాలను అధికారులు మూసివేయనున్నారు.

అయోధ్యలోని రామమందిరం, మధురలోని కృష్ణ జన్మభూమికి సమీపంలోని ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అయోధ్యలో మద్యం దుకాణాల యజమానుల లైసెన్స్‌లను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం మధుర-బృందావన్‌లోని 10 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తీర్థయాత్రగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో మద్యం, మాంసం అమ్మకాలు అనుమతించబడవు. గతంలో యోగి కృష్ణోత్సవ 2021 కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. కాగా, వారణాసి, బృందావనం, అయోధ్య, చిత్రకూట్, దేవబంద్, దేవా షరీఫ్, మిస్రిఖ్-నైమిశారణ్య వంటి అన్ని ప్రార్థనా స్థలాలలో మద్యం దుకాణాలపై నిషేధం, మాంసాహార విక్రయాలను నిషేధిస్తున్నట్టు గతంలో ఆయన ప్రకటించారు. ఈ ఆర్డర్ జూన్ 1, 2022, బుధవారం నుండి వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి