News

హిందువుల‌ గుండె ప‌గిలింది… త‌మిళ‌నాడులో మ‌రో ఆల‌యం నేల‌మ‌ట్టం!

793views
  • స‌ర్కారు భూమి ఆక్ర‌మించార‌ని గ‌ణ‌ప‌తిని కూల్చారు

  • అధికారుల మూర్ఖ‌త్వంతో విల‌పించిన భ‌క్తులు

పెరంబలూర్‌: హిందువుల‌ గుండె ప‌గిలింది… తమిళ‌నాడులో మ‌రో ఆల‌యం నేల‌మ‌ట్ట‌మైంది. హిందువులు, హిందూ దేవ‌త‌లే ల‌క్ష్యంగా జ‌రుగుతున్న దాడులు ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నాయి. పాల‌న‌పై నిర్ల‌క్ష్యం వైఖ‌రి అవ‌లంబిస్తున్న డిఎంకె స‌ర్కారుకు కేవ‌లం హిందువులు, వారి దేవ‌తలు ఎక్క‌డ ఉంటే, అక్క‌డే నిబంధ‌న‌లు గుర్తొస్తున్నాయ‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వెల్లువెత్తుతున్నాయి. గ‌ణేష్ ఆల‌యం ప్ర‌భుత్వ భూమి ఆక్ర‌మించింద‌ని, ఆధునిక యంత్రాల‌తో భ‌క్తుల రోద‌న‌ల న‌డుమ క‌నిక‌రం లేకుండా ధ్వంసం చేశారు. కూల్చివేతకు వ్యతిరేకంగా భక్తులు, హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. అయినా ఫ‌లితం లేక‌పోయింది.

పెరంబలూర్‌లోని వేప్పంతట్టై సమీపంలోని అయాన్ పెరైయూర్‌లోని గణేశ దేవాలయం రాష్ట్ర రహదారుల శాఖకు చెందిన భూమిని ఆక్రమించినట్టు అధికారులు చెబుతున్నారు. దీని వ‌ల్ల రాక‌పోక‌ల స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతోంద‌ని హైవేస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆలయ ధర్మకర్తకు నోటీసులు జారీ చేశారు. దానిని సవాలు చేస్తూ ధర్మకర్త కోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ ప్రక్రియపై స్టే విధించలేమని చెప్పిన కోర్టు.. 15 రోజుల్లో ఆలయాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించింది.

ఆలయాన్ని కూల్చివేసేందుకు అధికారులు రావడంతో భక్తులు నిరసన వ్యక్తం చేస్తూ ఆలయాన్ని కూల్చవద్దని కోరారు. అయినా భ‌క్తుల విన్న‌పాన్ని పెడ‌చెవిని పెట్టిన అధికార యంత్రాంగం ఆలయాన్ని కూల్చివేసింది. దీంతో భ‌క్తులంతా ఒక్క‌సారిగా బోరుమ‌న్నారు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా క‌న్నీళ్ళ‌ప‌ర్యంత‌మ‌య్యారు. తామంతా ఎంతో శ్ర‌మించి, అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఇటుక ఇటుక పెట్టి నిర్మించుకున్నామ‌ని మహిళా భక్తులు విలపించారు. ఈ దృశ్యాన్ని చూస్తుంటే పసికందును క‌సితీరా చంపినట్లుగా అనిపిస్తోందని ఓ భక్తురాలు విల‌పించింది.

ఆలయ నిర్మాణానికి తాము ఎంత కష్టపడ్డామో గుర్తు చేసుకుంటూ మహిళా భక్తులు “మీకు మనస్సాక్షి ఉందా?” అని అధికారులను ప్రశ్నించింది. చట్టపరమైన ప్రక్రియ ద్వారా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేదా ఆలయాన్ని తరలించాలని కోరింది. లేదంటే, క‌నీసం వారం రోజుల సమయమైనా ఇవ్వాల‌ని కోరింది. అయినప్పటికీ అధికారులు ప్రక్రియను కొనసాగించి ఆలయాన్ని నేలమట్టం చేశారు.

మద్రాసు హైకోర్టులో పిటిషన్

తమిళనాడు ప్రభుత్వం దేవాలయం/ చర్చి/మసీదు/ గురుద్వారా మొదలైనవి ప్రభుత్వ భూముల్లో ఉంటే, తొల‌గిస్తోంది. అయితే, ఇప్పటివరకు అత్య‌ధిక‌స్థాయిలో అరుదైన హిందూ దేవాలయాలపైనే త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంద‌ని భ‌క్తులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇతర మత ప్రార్థనా స్థలాలు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించాయి. అయినా పూర్తిస్థాయిలో వాటి జోలికి వెళ్ళ‌డం లేద‌ని భ‌క్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. దేవాలయాలను కూల్చివేయడంలో డిఎంకె ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష చర్యలపై దిశానిర్దేశం చేయాలని హిందూ మున్నాని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Source: Hindu Post

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి