359
-
జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు
విజయవాడ: గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్టు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని, సోదాల్లో భాంగా విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేరళలోనూ సోదాలు నిర్వహించినట్టు ప్రకటించిన ఎన్ఐఏ.. అక్కడ మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్టు వెల్లడించింది.