
భాగ్యనగరం: ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తిశద్ధలతో జరుపుకొనే కన్వర్ యాత్రకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులను స్వాగతిస్తుంటే హైదరాబాద్ ఎం.పి. అసదుద్దీన్ ఓవైసీ ప్రజలు కట్టిన పన్నులు వృథా అవుతున్నాయని మాట్లాడుతూ తన హిందూ ద్వేషాన్ని ప్రకటిస్తున్నాడని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) తెలంగాణ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.
హిందువులు దేవాలయాలలో సమర్పించిన లక్షలాది కోట్ల రూపాయల నుండే హిందూ పండుగలకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి కానీ ప్రజలు కట్టిన పన్నుల నుండి కాదని ఓవైసి తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా హిందూ పండుగలకు దేవాదాయ శాఖ నుండే నిధులు మంజారు చేస్తోందని, ప్రార్ధనా స్థలాల యాత్రలకు సబ్సిడీలు, పండుగలకు విందులు, ప్రార్ధనా స్థలాల మరమతులకు ఈ శాఖ నుంచి నిధులు సమకూరుతున్నాయన్న విషయాన్ని ఓవైసీ గుర్తు పెట్టుకోవాలని వీహెచ్‌పీ సూచించింది.
ఇకనుంచైనా హిందూ పండుగలపై అసత్యప్రచారాలు ఓవైసీ మానుకోవాలని హెచ్చరించింది.
Source: Nijamtoday





