
-
తృణమూల్ మాజీ మంత్రి చేసిన అవినీతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాల అవినీతి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఈడీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది కూడా. ఈ తరుణంలో అర్పిత నుంచి కీలక సమాచారం బయటపడుతోంది.
తాజాగా ఆమెకు చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆమె ఇంట్లో ఓ గది సెల్ఫ్ నుంచి కోట్ల రూపాయలను గుర్తించారు. ఈ మేరకు బ్యాంక్ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్ మెషీన్‌తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు.
అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. అందులో పార్థా ఛటర్జీకి చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. రాజ్‌దంగాలోనూ అర్పితా ముఖర్జీకి మరో ఫ్లాట్ ఉన్నట్టు సమాచారం.