News

బుల్డోజింగ్ పై స్టే ఇవ్వలేం: స్పష్టం చేసిన సుప్రీం

473views

నుపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనల పేరుతో ఇటీవల యూపీలో రాళ్ళ దాడులు, విధ్వంసానికి పాల్పడ్డ ముస్లింల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ జమియత్-ఉలేమా-ఏ-హింద్ సంస్థ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్ పై స్పందించాలని, 3 రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చేవారం దీనిపై విచారణ జరుపుతామని, అప్పటివరకు కూల్చివేతలపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.