
* బీహార్లో రైలు దహనానికి పాల్పడ్డ అల్లరి మూకలు
* వ్యూహాత్మక దాడులుగానే అభిప్రాయపడుతున్న విశ్లేషకులు
యువతను పెద్ద ఎత్తున సైన్యంలో రిక్రూట్ చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ స్కీంను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై కూడా దేశంలో అక్కడక్కడా నిరసనలు వ్యక్తమవుతున్నాయ్. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం కావడం ఇష్టంలేని కొన్ని శక్తులు ‘అగ్నిపథ్’ స్కీంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాయ్. ఎక్కడికక్కడ తీవ్రమైన హింసకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా బిహార్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాప్రా ప్రాంతంలో రైలుకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఒక బోగీ పూర్తిగా కాలిపోయింది. ఆరా రైల్వేస్టేషన్పై రాళ్లు విసిరారు. నావాడలో బీజేపీ ఆఫీసును తగులబెట్టారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
This is what happens when you mollycoddle anarchists, whether on CAA or 370 abrogation or the farm bill protests. Now they are down to burning trains because they don’t like an army recruitment scheme.
A lesson not given, is a lesson not learnt. pic.twitter.com/1Rf4fG28jB
— Anand Ranganathan (@ARanganathan72) June 16, 2022
ఈ మధ్య ఏ విషయం తీసుకున్నా ఈ తరహా నిరసనలు, హింసాత్మక ఘటనలు, రాళ్ళ దాడులు, ఆస్తుల విధ్వంసం, రైలు దహనాలు పరిపాటి అయిపోయాయ్. జాతీయవాద మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను మసకబార్చాలనే లక్ష్యంతోనే విద్రోహ శక్తులు, అల్లరి మూకలు ఈ తరహా దాడులను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. CAA, NRC ల విషయంలోనూ, రైతు చట్టాల విషయంలోనూ, నూపుర్ శర్మ అంశంలోనూ కూడా ఇదే తరహా దాడులు జరిగాయి. మొత్తానికి దేశంలో పాలనను స్తంభింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాని కోసం దేశ, విదేశాలలోని విద్రోహ మూకలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.





