News

జూబ్లీహిల్స్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే

452views

భాగ్య‌న‌గ‌రం: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషులను తప్పించేందుకు కుట్ర చేశారని, దోషులకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మండిప‌డ్డారు. తెలంగాణలో రక్షకులే భక్షకులుగా మారారని మండిపడుతూ తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే అసలు నిందితులెవ్వరో తేలుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో జంగల్ రాజ్ నడుస్తుందని, న్యాయ వ్యవస్థకు స్థానం లేదని, తెలంగాణ బిడ్డలు సురక్షితంగా లేరని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయ‌ని ఆయన మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడటంలో, పరిపాలనా నిర్వహణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దుమ్మెత్తిపోశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి