News

నేటి నుంచి వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు

368views

తిరుప‌తి: తిరుమలలో నేడు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జూన్ ఒక‌టోతేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఉదయం 10 గంటలకు బదులుగా మధ్యాహ్నం మూడు గంటలకు దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఆగస్టు నెల గదుల కోటాను కూడా విడుదల చేయనున్నట్టు పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి