
7views
కొచ్చి : కొచ్చిలో ‘‘తపస్య కళా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను వీరు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా కేరళలోని సాంస్కృతిక సంస్థలను జిహాదీ శక్తులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రాజకీయాలు మరియు మతపరమైన మౌలికవాదుల అధిక ప్రభావం కారణంగా ఈ సాంస్కృతిక సంస్థలు తీవ్ర సమస్యలను ఎదుర్కుంటున్నాయని పేర్కొన్నారు.
కేరళలో గత కొన్ని దశాబ్దాలుగా కళలు మరియు సాహిత్యానికి సంబంధించిన సాంస్కృతిక సంస్థలు తీవ్ర రాజకీయాలకు లోనయ్యాయని తీర్మానం చేశారు. పేర్కొంది. అకాడమీలు, వివిధ సంస్థలు, కళా అధ్యయన కేంద్రాలు, గ్రంథాలయాలు, కేరళ కళామండలం మరియు అరన్ముల వాస్తు విద్యా గురుకులం వంటి 27 సంస్థలు… ఏదో ఒక విధంగా దేశ వ్యతిరేక, జాతీయతా వ్యతిరేక మరియు మానవత్వ వ్యతిరేక రాజకీయాలు, సిద్ధాంతాలకు ప్రయోగశాలలుగా మార్చేశారని మండిపడ్డారు.
డబ్బులను దుర్వినియోగం చేస్తూ, తమ అనుచరులకు పదవులు ఇప్పించుకుంటూ, రాజకీయ సంస్థలు, జిహాదీ శక్తులు ఈ సాంస్కృతిక కేంద్రాలను విలాసవంతమైన జీవన శైలికి కేంద్రాలుగా మార్చేశాయన్నారు. రాష్ట్రాన్ని ఒకదాని తర్వాత ఒకటిగా పాలించే రాజకీయ కూటములు (కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూటములు) ఈ ఆటను ఆడుతున్నాయని తపస్య కళా వేదిక ఆరోపించింది.
పరిస్థితులు అనుకూలంగా వుంటే పదవుల్లో వున్న వారు రాజకీయ నేతలతో బేరసారాలు జరిపి, తమ పదవీ కాలం ముగిసినా… ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారని ఆరోపించింది. కేరళలో ఇది చాలా రోజులుగా కనిపిస్తున్న దృశ్యమని, సాహిత్య రంగాలలో ప్రతిభకు బదులుగా, మతం, రాజకీయాల ప్రాతిపదికగా నియామకాలు జరుగుతున్నాయని విమర్శించారు. దేశ వ్యతిరేక ధోరణి కలిగి ఉండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యవస్థను గౌరవించని వ్యక్తులు కేరళకు వస్తుంటారని, దుర్మార్గ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీపై తరుచూ విమర్శలు చేసిన ఫలితంగా మల్లికా సారాభాయ్ కలమండలం డీమ్డ్ యూనివర్సిటీకి వీసీగా నియమితులయ్యారని ఆరోపించారు. ఆమె లక్షల రూపాయల జీతం, ఇతర సౌకర్యాలు కూడా పొందుతున్నారని పేర్కొన్నారు.యూడీఎఫ్ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆమె ఆ పదవిలో కొనసాగుతున్నారని తెలిపారు.
స్వయంప్రతిపత్తి కలిగి ఉండి, కళలు మరియు సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన సంస్థలు కూడా అధికార కూటమికి తలొగ్గుతున్నాయని, ఇప్పటికీ సాంస్కృతిక సంస్థలపై పట్టు సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.





