News

చత్తీస్‌గఢ్‌లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు

7views

చత్తీస్‌గడ్‌లో పలువురు మావోయిస్టులు లొంగిపోయారు.  వనం వీడి జనం బాట పట్టారు మరికొంతమంది మావోయిస్టులు. మావోయిస్టు పార్టీకి కేంద్రం పెట్టిన డెడ్‌లైన్‌ మరో  కొన్ని  రోజుల మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు పాపారావు 17 మందితో కలిసి లొంగిపోయారు.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు,  సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జ్‌గా ఉన్నారు పాపారావు. లొంగిపోయిన వారిలో 8 మంది మహిళలతో సహా మొత్తం వివిధ క్యాడర్లకు చెందిన 17 మంది మావోయిస్టులు ఉన్నారు. ఆయుధాలతో సహా వీరు లొంగిపోయినట్లు చత్తీస్‌గఢ్‌ పోలీసులు తెలిపారు.

వీరిని త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వీరంతా చత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ, బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ సమక్షంలో తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయినట్లు సమాచారం.