News

ఆర్.ఎస్.ఎస్. అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్

27views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క వార్షిక అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ కర్ణాటకలోని బెలగావిలో ముగిసింది. ఈ సమావేశంలో పరమ పూజనీయ సర్‌సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్, మాననీయ సర్కార్యవాహ్ దత్తాత్రేయ జీ హోసబాలే, అలాగే మొత్తం 226 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మార్చి 2026 తర్వాత సంఘంలోని వివిధ స్థాయిలలో నిర్వహించిన శిక్షణా వర్గలపై సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 83 సంఘ శిక్షా వర్గలు మరియు 12 కార్యకర్త వికాస్ వర్గలు పూర్తయ్యాయి. వీటిలో మొత్తం 18,842 మంది స్వయంసేవకులు శిక్షణ పొందారు. ఈ శిక్షణలో నిత్యశాఖ, సంఘ కార్యపద్ధతి, గ్రామ వికాస్, కుటుంబ ప్రబోధన్, విపత్తు నిర్వహణ, పర్యావరణం వంటి అంశాలు ఉన్నాయి.

శాఖ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక అమలుపై విస్తృతంగా చర్చ జరిగింది. అలాగే సెప్టెంబర్ నెలలో గరిష్ఠ శాఖ విస్తార్ యోజన గురించి కూడా చర్చించారు. దీనితో పాటు సంఘ శతాబ్ది సంవత్సరంలో ఇప్పటివరకు పూర్తయిన కార్యక్రమాల సమీక్షతో పాటు, మిగిలి ఉన్న నిర్దేశిత కార్యక్రమాల ప్రణాళికపై కూడా పరిశీలన జరిగింది.

సంఘ శతాబ్ది సంవత్సరం సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల ద్వారా పరిచయమైన ప్రజలను సామాజిక సేవా కార్యక్రమాలు మరియు పంచ పరివర్తన్ కార్యక్రమాలతో చురుకుగా అనుసంధానించే ప్రణాళికలపై చర్చించారు. అలాగే పరమ పూజనీయ సర్‌సంఘచాలక్ జీ వారి 2026–27 సంవత్సరపు ప్రవాస యోజన గురించి కూడా చర్చించారు.

ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన పలు అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా జనగణనకు సంబంధించిన సమాచారం, అలాగే జనాభా అసమతుల్యత వల్ల ఉత్పన్నమవుతున్న సవాళ్లు గురించి చర్చించారు. పెరుగుతున్న మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యసన విముక్తికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సిన అవసరంపై చర్చించారు. అలాగే సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ వారి 650వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించాల్సిన కార్యక్రమాల ప్రణాళికపై కూడా చర్చ జరిగింది.

సమావేశంలో శ్రీరామ జన్మభూమి మందిర హుండీ కానుకల లెక్కింపులో జరిగిన అక్రమాల ఘటనపై అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తీర్థక్షేత్ర న్యాస్ అభ్యర్థన మేరకు ప్రారంభమైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరియు పోలీసుల చర్యలు నిర్ణయాత్మక దశకు చేరుకుంటాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రామమందిరం పట్ల సమస్త రామభక్తుల భక్తి, విశ్వాసాలకు భంగం కలిగించే ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా తీర్థక్షేత్ర న్యాస్ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సునీల్ అంబేకర్
అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్