News

‘అల్లా హు అక్బర్’ అని అరచిన విద్యార్థినికి రూ. 5 లక్షలు!

980views

బెంగ‌ళూరు: కర్ణాటక రాష్ట్రంలోని కళాశాలల్లో హిజాబ్‌పై వివాదం కొనసాగుతూ ఉండగా జమియత్ ఉలమా-ఇ-హింద్ సంస్థ ఒక వర్గానికి వ్యతిరేకంగా “అల్లాహు అక్బర్” నినాదాలు చేసిన బురఖా ధరించిన నిరసనకారినికి రివార్డ్ ప్రకటించి వివాదానికి దారితీసింది. కర్ణాటకలోని మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో విద్యార్థుల బృందం వద్ద బీబీ ముస్కాన్ ఖాన్ “అల్లాహు అక్బర్” అని అరుస్తూ కనిపించిన వీడియో మంగళవారం వైరల్ అయింది. పీఈఎస్‌ కళాశాల క్యాంపస్‌లో ఇస్లామిక్ నినాదాలకు ప్రతిస్పందనగా హిందూ విద్యార్థులు “జై శ్రీ రామ్” అని నినాదాలు చేశారు.

బీబీ ముస్కాన్ ఖాన్ మాట్లాడుతూ బయటి వ్యక్తులు కొందరు తనను ఇబ్బంది పెట్టారని, మాండ్యాలోని పిఇఎస్ కాలేజీలో తన క్లాస్‌మేట్స్, అధికారులు తనకు మద్దతు ఇచ్చారని తెలిపింది. ఈ ఘటన చోటు చేసుకున్న ఒక రోజు తర్వాత, నిరసనల సమయంలో బురఖా ధరించి “అల్లాహు-అక్బర్” అని నినాదాలు చేసినందుకు ముస్కాన్ ఖాన్‌కు రూ. 5 లక్షల నగదు బహుమతిని ప్రకటించడం ద్వారా జమియత్ ఉలమా-ఇ-హింద్ అగ్నికి మరింత ఆజ్యం పోసింది. ఒక ట్వీట్‌లో దియోబంద్ ఆధారిత ఇస్లామిక్ సంస్థ తన రాజ్యాంగ, మతపరమైన హక్కుల కోసం తీవ్ర నిరసనల మధ్య బీబీ ముస్కాన్ ఖాన్ ఎదురు నిలబడిందని పేర్కొంది.

కర్ణాటకలో బురఖాల వివాదం మంగళవారం తీవ్ర రూపం దాల్చడంతో, రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించిన విష‌యం విదిత‌మే. “శాంతి, సామరస్యాన్ని కాపాడాలని నేను విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్ , కాలేజీలను మూసివేయాలని ఆదేశించాను. ఇందుకు సంబంధించిన వారందరూ సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం’’ అని బొమ్మై ట్వీట్ చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి