
కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలలో ఇప్పుడు ఓ కొత్త వివాదం రాజుకుంది. మొదటిగా ముస్లిం విద్యార్థినులు ఆయా విద్యాసంస్థల నియమ నిబంధనలను తోసిరాజని, యూనిఫామ్ లు కాదని తాము హిజాబ్ లు, బురఖాలు ధరించి రావడంతో సమస్య మొదలైంది. అందుకు ప్రతిగా హిందూ విద్యార్థినీ విద్యార్థులు కూడా కాషాయ కండువాలు ధరించి రావడం మొదలైంది. దీంతో వివాదం రాజుకుంది.
1983లో ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విద్యా చట్టం ప్రకారం విద్యార్థినీ విద్యార్థులు కర్ణాటకలో ఆయా పాఠశాలల యూనిఫాంలు ధరించడం తప్పనిసరి. కానీ ఇప్పుడు ముస్లిం విద్యార్ధినులు అందుకు విరుద్ధంగా హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతూ ఉండడంతో కొందరు హిందూ విద్యార్థినీ విద్యార్థులు కూడా కాషాయ కండువాలతో తరగతులకు హాజరవటం ప్రారంభించారు. దీనిపై ప్రశ్నించిన విద్యాసంస్థల యాజమాన్యాలతో “వారు హిజాబ్ ధరించి రావడానికి అభ్యర్థన లేనప్పుడు మా కాషాయ కండువాలకు ఏం అడ్డమొచ్చిందంటూ” ప్రశ్నించారు. దాంతో కళాశాల యాజమాన్యాలు ఇరువర్గాల పైన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు వ్యవహారం మొత్తం కర్ణాటక హైకోర్టు ముంగిటకొచ్చింది.
అసలు ఆ విద్యార్థినులకు తమ యూనిఫాంపై ఇన్నాళ్లూ లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు? దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అన్న ప్రశ్నలు ఒక ఎత్తైతే…. ఎన్ని దశాబ్దాలు గడచినా ముస్లిములు మిగిలిన భారతీయ సమాజంతో ఎందుకు మమేకం కాలేకపోతున్నారు? అన్నది ఎంత బుఱ్ఱ గోక్కున్నా అర్థం కాని అతి పెద్ద ప్రశ్న. భారతీయ చట్టాలను ఏ మాత్రం గౌరవించరు…. ప్రతిదానికీ అభ్యంతరాలు చెబుతారు…. అడ్డంకులు సృష్టిస్తారు…. అసలు ఎన్నాళ్ళిలా? ఎందుకిలా? భారతీయ ముస్లిములకు ఏ మాత్రమూ సంబంధం లేని, ఈ విధమైన ఇబ్బందీ కలిగించని CAA, NRC లపై నిరసన గళాన్ని విప్పారు. ఢిల్లీలో నెలల తరబడి దీక్షలు చేపట్టారు. పెద్ద ఎత్తున అల్లర్లు రేపారు. ఇవనే కాదు ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఏ చిన్న అవకాశం లభించినా వారు పెద్ద ఎత్తున అల్లర్లు లేవ దీస్తూనే ఉన్నారు. అలజడులు సృష్టిస్తూనే ఉన్నారు. అన్నింటికీ ఒకటే మంత్రం. హింస…. అందులోనూ రాళ్ల దాడులు…. ఈ 75 ఏళ్ల లో ఈ రాళ్ల దాడుల కారణంగా మన దేశంలో ఓ పదివేల మంది పైగా మృతి చెంది ఉంటారంటే అతిశయోక్తి కాదేమో? ఈ అల్లర్ల వెనుక, అలజడుల వెనుక ఉన్న కారణాలు ఇలా పైకి కనిపిస్తున్నవి కానే కాదు. దాని వెనుక వారి పరమత అసహిష్ణుత దాగి ఉన్నది. దురాక్రమణ మనస్తత్వం దాగి ఉన్నది. ఇతర మతావలంబకులతో సహవాసం, సహజీవనం చెయ్యలేని విభజనవాద ధోరణి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా తాము ఉన్న అన్ని దేశాలలోనూ ఏదో ఒక పేరుతో, ఏదో ఒక రూపంలో ఇదే తరహా అల్లర్లు, హింస, విధ్వంసాలకు పాల్పడుతూ ఉండడమే అందుకు ఉదాహరణ. మన దేశంలో సైతం వారి ఆధిపత్యం ఉన్న అన్ని ప్రాంతాలలోనూ ఈ తరహా దాడులు, విధ్వంసం సర్వ సహజం. లేకపోతే ఆమధ్య బెంగళూరులోనే ఎవరో ఒక వ్యక్తి ఫేస్బుక్లో పెట్టిన పోస్టుకు ప్రతిగా ఆ వీధి వీధిని ధ్వంసం చెయ్యడం ఏమిటి? అది దేనికి సంకేతం?
ఈ ప్రశ్నలు, సందేహాలన్నీ ఓ పక్కన పెట్టి ఈ అంశంపై తెగ ఆవేశపడి, ఆయాసపడుతున్న మన మేథావుల గురించి కొంచెం ముచ్చటించుకుందాం. ‘జై శ్రీరాం’ నినాదాలతో ఊరేగింపుగా వెళుతున్న ఒక బృందానికి పోటీగా ఒక యువతి “అల్లాహో అక్బర్” అంటూ నినదించింది. ఓకే… సంతోషం. ఆమెలో మీకు అపార సాహస శౌర్య పరాక్రమాలు కనిపించాయి. మరీ సంతోషం. మరి అదే సమయంలో ఒంటరిగా, తమకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వెళుతున్న ఆ యువతిని పల్లెత్తు మాట కూడా అనకుండా ముందుకు సాగిపోయిన ఆ యువ బృందంలోని సంస్కారం మీకు ఆశ్చర్యాన్ని కలిగించలేదా? ఎవరి నినాదాలు, ఎవరి విధానాలు వారివని నమ్మి నడుచుకున్న ఆ యువకుల బృందంలో మీకు ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబడలేదా? సరే… పోనీ ఇదే దృశ్యం ఉల్టాలో జరిగి ఉంటే ఆ అమ్మాయి బ్రతుకు ఏమై ఉండేదో కనీసం ఊహించగలమా?
దశాబ్దాలుగా మన దేశంలో క్రైస్తవ విద్యాసంస్థలలో మతపరమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రచారము, మత మార్పిడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలలో సైతం ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయని తరచుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయ్యప్ప మాల ధరించిన చిన్నారుల్ని పాఠశాలలలోకి అనుమతించని సందర్భాలెన్నో. అమ్మాయిల్ని పండుగల వంటి సందర్భాలలో సైతం ప్రత్యేక దుస్తులు ధరించి రావటానికి అనుమతించరు. ఇప్పుడు ఈ హిజాబ్ వ్యవహారంలో ముస్లిం మతాచారాలకేదో భంగం వాటిల్లిపోతోందని గుండెలు బాదుకుంటున్న ఈ మేథో వర్గం ఆనాడు నోరు తెరిచి కనీసం ఇది అన్యాయమని ఆక్రోశించలేదే? ఎప్పటిదాకో ఎందుకు… ఇటీవల తమిళనాడులో మృతి చెందిన లావణ్య అనే చిన్నారి మృతికి సదరు క్రైస్తవ విద్యాసంస్థ మతపిచ్చ, మతమార్పిడి యత్నమే కదా కారణం? మరి అప్పుడు కూడా ఈ మేథావులు నోరు మెదపలేదే? ఒక మత మౌఢ్యపు విద్యాసంస్థ మత పిచ్చ కారణంగా ఒక అమాయక, అభాగ్య బాలిక ప్రాణాలు కోల్పోతే ఈ మేథావులు అయ్యో పాపం అనలేదే? అయినదానికీ కానిదానికీ కొవ్వొత్తుల ప్రదర్శనలు చేసి సమాజంలో మానవతా వెలుగులు నింపామని సంబరపడిపోయే మానవతావాదులందరూ అప్పుడు ఏ మరుగున, ఏ కలుగున దాక్కున్నారు? ఇప్పుడు ఈ హిజాబ్ వ్యవహారంలో మాత్రం ఎందుకు నోళ్లేసుకుని పడిపోతున్నారు? ఏం పాపం లావణ్యకు జీవించే హక్కు లేదా? లావణ్యకు మత స్వేచ్ఛ ఉండదా? లావణ్యది ప్రాణం కాదా? మన దేశంలో, మన మీడియా చేత మేథావులుగా కీర్తింపబడాలంటే ఈ మాత్రం అర్హతలుండాలేమో?
ఇన్నాళ్లూ హిందువుల ఆచార వ్యవహారాలు మూఢమైనవిగా కనిపించి, వాటిని శతధా విమర్శిస్తూ, ఎండగడుతూ వచ్చిన ఘనత వహించిన సెక్యులర్ వాదులందరికీ ఇప్పుడు, ఈ హిజాబ్ విషయంలో మాత్రం వారి మతాచారాలు, కట్టుబాట్ల పట్ల ముస్లిములకున్న నిబద్ధత, భక్తి ప్రపత్తులు కనిపిస్తున్నాయి. అదేం విచిత్రమో కానీ గడప దాటిన ప్రతి మహిళకూ, వారి వయసుతో సంబంధం లేకుండా ముసుగు వేసి బయటకు పంపడంలో ఈ ప్రసిద్ధ అభ్యుదయవాదులకు, స్వేచ్ఛావాదులకు ఎలాంటి అభ్యంతరమూ కనిపించటంలేదు. స్త్రీని ఆదిపరాశక్తిగా భావించి, పూజించి, సమాదరించిన హిందూ సమాజంలో మాత్రం స్త్రీల పట్ల తీవ్ర వివక్ష ఉన్నట్టు వీళ్లకు కనిపిస్తూ ఉంటుంది. అమ్మో పుంఖానుపుంఖాలుగా కథలు, కథనాలు, గ్రంథాలు, సినిమాలు, సీరియళ్ళు ప్చ్….. హిందూ సమాజం మీదకి ఎన్ని బాణాలు వదిలారో? ఎన్ని బాంబులు వేశారో? కొన్ని తరాలకు సరిపడా విషాన్ని మా బుఱ్ఱలలో నూరిపోశారు.
అయితే ఇప్పుడు, ఈ క్షణాన వారందరూ, ముఖ్యంగా… స్త్రీ వివక్ష పేరుతో హిందూ సమాజాన్ని నిందించే అవకాశాన్ని, అర్హతను కోల్పోయారనే సంగతి తెలుసుకోవాలి. ఇలాంటి రెండు నాల్కల కాల నాగులపై హిందూ సమాజం కూడా ఇకమీదట అప్రమత్తంగా ఉండాలి. వారి మాయ మాటల వలలో పడకూడదు. ఆత్మన్యూనతకు లోనవకూడదు. ఇవాళ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకునే ముక్కుపచ్చలారని పసిపాపలు హిజాబ్ ధరించడాన్ని వారి ప్రాథమిక హక్కుగా, వారి చైతన్యానికి చిహ్నంగా అభివర్ణిస్తూ ఉన్న ఈ కుహనా అభ్యుదయ వాదులెవరైనా మున్ముందు ఎప్పుడైనా, ఎక్కడైనా హిందూ సాంప్రదాయాలపై, ఆచార వ్యవహారాలపై, పూజా విధానాలపై నోరు జారారో…. హిందుత్వ వాదులారా మొహమాటాన్ని వీడండి…. నిస్సంకోచంగా వారి డొక్క చించి డోలు కట్టండి. అలాగని ఇప్పుడే ఈ క్షణాన్నే వారిని హెచ్చరించండి.





