
796views
-
భారత్, రష్యా నిర్ణయం
న్యూఢిల్లీ: అఫ్గాన్‌లో మారుతున్న పరిణామాలపై వివిధ దేశాలతో భారత్ వరుస చర్చలు జరపుతోంది. ఇందులో భాగంగా.. రష్యా సెక్రటరీ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ నికోలాయ్ పాట్రూషెవ్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ దిల్లీలో సమావేశమయ్యారు. అఫ్గాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం సహా దక్షిణాసియాలో జైష్-ఏ -మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడంపై నికోలాయ్, అజిత్ డోభాల్ చర్చించారని సంబంధింత వర్గాలు తెలిపాయి.
అయితే.. అఫ్గాన్ విషయంలో.. సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై వ్యతిరేక పోరాటంలో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.





