News

350 యుద్ధవిమానాల సేకరణకు యోచన

700views

న్యూఢిల్లీ: రానున్న 20 ఏళ్లలో దాదాపు 350 యుద్ధ విమానాల సేకరణకు భారత వాయుసేన యోచిస్తోంది. ఈ మేర‌కు భారత వైమానిక దళాధిపతి ఆర్​కేఎస్​ భదౌరియా తెలిపారు. భారత అంతరిక్ష రంగంపై దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలను రోజురోజుకూ అధికం చేస్తున్న నేపథ్యంలో భారత ఏరోస్పేస్‌ రంగాన్ని శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం దేశీయ తయారీ సంస్థలపై దృష్టిపెడతామన్న భదౌరియా… రాబోయే రెండు దశాబ్దాల్లో తేలికపాటి యుద్ధ విమానాలు సహా 350 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమాకూర్చుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. భారత్‌ రూపొందించిన తేజస్‌ తేలికపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌… దేశీయ ఉత్పత్తి రంగం అభివృద్ధికి ఊతం ఇస్తుందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి