News

వారణాసి అభివృద్ధికి ప్రధాని మోడీ అడుగులు..180 కోట్లతో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్..1500 కోట్లతో పలు నిర్మాణాలు..

432views

వారణాసి నగరాన్ని వేగంగా అభివృద్ధి చేసేందుకు చకచక అడుగులు పడుతున్నాయి. దీనిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వారణాసి పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు  రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో అంతర్జాతీయ సమావేశాలు, సంగీత కచేరీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే అందుకు సదుపాయాల్ని అందించనున్నారు. ఇక్కడ విశాలమైన పార్కింగ్ లో 120 కార్లను ఒకేసారి పార్కింగ్ చేయవచ్చు.

మూడు ఎకరాల విస్తీర్ణంలో వారణాసిలోని సిగ్రాలో దీన్ని నిర్మించారు. రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఆధునిక సాంకేతికతో 1,200 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన రెండు అంతస్తుల ఈ సెంటర్‌ను జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో దీన్ని నిర్మించారు. జపాన్ పీఎం షింజో అబే 2016లో రుద్రాక్ష్కు పునాది వేశారు. 1500 కోట్ల విలువైన పలు    అభివృద్ధి ప్రాజెక్టులకు మోడీ శ్రీకారం చుట్టనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.