News

అమెరికా విధానాల కారణంగా… కెనడా వైపు చూస్తున్న భారత విద్యార్థులు..

732views

ప్రతిభావంతులైన భారతీయ యువత… అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతోందని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ వీసా విధానంపై అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరే అందుకు కారణమని చట్టసభ్యులకు తెలిపారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులు, శాశ్వత నివాస హోదా జారీకి దేశాల వారీగా కేటాయింపులు చేయడం వంటి చర్యలు భారతీయ యువత కెనడాకు తరలివెళ్లడానికి దారితీస్తున్నాయన్నారు.

మూడు ఉద్యోగ ఆధారిత విభాగాల బ్యాక్‌లాగుల్లో భారతీయుల వాటా ప్రస్తుతం 9.15 లక్షలుగా ఉందన్న అధికారులు.. ఈ సంఖ్య 2030 నాటికి 21.95 లక్షలకు చేరుతుందని అంచనావేశారు. సుమారు 20 లక్షల మంది దశాబ్దం పాటు ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కోసం వేచిచూడాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు వలసలు, పౌరసత్వానికి సంబంధించి హౌస్ జ్యుడిషియరీ కమిటీ ముందు అధికారులు తమ వాదనలు వినిపించారు. భారతీయ ప్రతిభ అమెరికా నుంచి కెనడా వైపు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అమెరికన్ కాంగ్రెస్ ‌ను కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.