
ఎంతో ప్రసిద్ది చెందిన ఓ చర్చిలో ఫాస్టర్ చెయ్యకూడని పాడుపని చేయిస్తున్నాడు. పవిత్రమైన స్థలంలో హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న ఫాదర్…. తన మతం వాళ్లు తలదించుకునే పని చేశాడు. ఖరీదైన లగ్జరీ కార్లలో చర్చి ఆవరణంలోని బంగ్లాలోకి వెళుతున్న అమ్మాయిలు, మహిళలు, ఆంటీలు, పురుషులు హైటెక్ వ్యభిచారం చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతూ పోలీసులకు చిక్కిపోయారు. మొత్తమ్మీద ఈ సెక్స్ రాకెట్ సూత్రధారి ఆ చర్చి పాస్టర్ పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ అని వెలుగు చూడటం కలకలం రేపింది.
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా మంగుడులోని జ్యోతినగర్ లో క్రైస్ట్ అంగ్లీకన్ చర్చ్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఫెడరల్ చర్చ్ ఆఫ్ ఇండియా చర్చి ఉంది. ఇది చాలా ఫేమస్ చర్చి. ఈ చర్చి ఫౌండర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్. ఆ చర్చికి బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ అధ్యక్షుడిగా పని చేస్తూ ప్రతిరోజూ ప్రార్థనలు చేస్తున్నారు.
కన్యాకుమారిలో ఈ చర్చి చాలా ఫేమస్, క్రైస్తవులు ప్రతినిత్యం ఈ చర్చికి తండోప తండాలుగా వెళ్లి “మమ్మల్ని ప్రభువు కరుణించాలి” అని భక్తిగా ప్రార్థనలు చేస్తుంటారు. కన్యాకుమారి జిల్లాతో పాటు తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్రైస్తవులు ఈ చర్చికి వచ్చి పోతూ ఉంటారు.
ఈ చర్చి కాంపౌండులో ఒక బంగాళా ఉంది. ఇటీవలి కాలంలో ఈ బంగళాకి ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వెళుతూ ఉన్నారు. ఖరీదైన కార్లలో పొట్టి దుస్తులు వేసుకున్న అమ్మాయిలు, వారి వెంట పురుషులు వచ్చి చర్చి ఆవరణంలోని బంగ్లాలో గంటలు గంటలు బస చేస్తున్నారని స్థానికులు గుర్తించారు.
స్థానికులు పదేపదే చర్చి నిర్వహకుల మీద ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు నిఘా వేశారు. పోలీసులు ఒక్కసారిగా చర్చి ఆవరణంలోని బంగ్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాలోని అనేక గదుల్లో పూర్తి నగ్నంగా ఉన్న అమ్మాయిలు, పురుషులు, మహిళలు జంటలు జంటలుగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు.
పోలీసులు చర్చి ఆవరణంలోని బంగ్లాలో ఉన్న మూడు జంటలను అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరు గదుల్లో ఎంజాయ్ చేస్తూ పట్టుబడిన వాళ్లు భార్యాభర్తలు కాదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. చర్చి పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ ను పోలీసులు విచారణ చేశారు. పోలీసుల విచారణలో చర్చి పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసుల మతిపోయింది.
చర్చి పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ తో సహా షైన్ (36), షిబిన్ (34), రాణి (55), సుకాంతి (40) మొత్తం 7 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాము చర్చి ఆవరణంలో హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్నామని పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్, షిబిన్ లు ఇద్దరూ అంగీకరించారని కన్యాకుమారి జిల్లా పోలీసులు తెలిపారు.
19 ఏళ్ల అమ్మాయితో ఆమె తల్లి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న విషయం ఇక్కడ పోలీసుల విచారణలో వెలుగు చూసిందని కన్యాకుమారి పోలీసులు తెలిపారు. చర్చి ఆవరణలోని బంగ్లాలో హైటెక్ వేశ్యావాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని వెలుగు చూడటం తమిళనాడులో కలకలం రేపింది, చర్చి పాస్టర్ బిషప్ లాల్ ఎన్ఎస్ షైన్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు.
Source : One India





