News

మధుర ( U.P) లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం కేశవ్ భవన్ పై దాడి

851views

మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని మధుర, సరస్వతి కుంజ్ లోగల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయం కేశవ్ భవన్ పై కొందరు ముస్లిములు కర్రలతో దాడి చేసి అక్కడి ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో సంఘ్ కార్యకర్త (భాగ్ శారీరిక్ ప్రముఖ్) పవన్ గుర్జర్, మరొక కార్యకర్త సోనూలు గాయపడ్డారు. ముస్లిం మూక సంఘ్ కార్యాలయం పై రాళ్ళు రువ్వింది. సోమవారం, 17 ఏళ్ల వయసున్న ఎకె ఖాన్ సంఘ్ కార్యాలయ పరిసరాల్లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. సంఘ కార్యకర్తలు అతన్ని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు అతన్ని హెచ్చరించి వదిలేశారు.

అయితే ఎ.కె.ఖాన్ మొబైల్ ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంలోనే ఉండిపోయింది. మంగళవారం, ఆ మొబై‌ల్ కు ఎవరో కాల్ చేసి ఎక్కడున్నావంటూ ప్రశ్నించారు. వారిని సంఘ కార్యాలయానికి పిలిచి విచారించగా వారు ఎ.కె.ఖాన్ తో కలసి ప్రతిరోజూ కార్యాలయ పరిసర ప్రాంతాలలో దొంగతనానికి పాల్పడుతున్నట్లుగా తెలిసింది. కార్యకర్తలు వారిని హెచ్చరించి వదిలేశారు. కొంత సమయం తరువాత, ఒక 50 మంది ముస్లిం పురుషులు మరియు మహిళలు సంఘ్ కార్యాలయంపై దాడి చేసి కార్యాలయంలో ఉన్న కార్యకర్తలను కొట్టారు. సంఘ కార్యకర్తలు కూడా దీటుగా బదులివ్వడంతో వారు అక్కడి నుంచి పారిపొయ్యారు.

అనంతరం, మళ్ళీ పెద్ద సంఖ్యలో ముస్లింలు వచ్చి సంఘ్ కార్యాలయాన్ని చుట్టుముట్టి రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. అప్పటికి మరికొందరు సంఘ కార్యకర్తలు కార్యాలయానికి చేరుకుని ఉన్నారు. కార్యకర్తలు దాడి చేసిన ముస్లింలను ఎదిరించి తరిమికొట్టారు. ఆర్ ఎస్ ఎస్ తరపున పోలీసులకు ఫిర్యాదు ఇవ్వబడింది. మధురలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఈ దాడికి సంబంధించి సల్మాన్, ఫిరోజ్ మరియు ఇతర దాడి నిందితుల కోసం వెతుకుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.