కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో కొండమీదరాయుడు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఈ సందర్బంగా స్వామి గరుత్మంతుడిపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడవాహన సేవకు ముందు ఉదయం స్థానిక కొండమీదరాయుడు స్వామి దేవాలయంలో ఉత్సవమూర్తులకు గరుడాద్రి బ్రాహ్మణ సంఘం వారు ప్రత్యేక పూజలు చేశారు....







