
32views
చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.99,01,458 ( సుమారు 99 లక్షలు) లభించింది. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపంలో స్వామి కానుకలను చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో వెంకటేశు పర్యవేక్షణలో లెక్కించారు. 50 గ్రాముల బంగారు, కేజీ 300 గ్రాముల వెండితోపాటు 930 యూఎస్‌ఏ, 1,015 ఆస్ట్రేలియా, 135 కెనడా, 12 సింగపూర్ డాలర్లు, 25 యూఏఈ దిర్హామ్స్, 10 ఇంగ్లండ్ పౌండ్లు, 847 మలేసియా రింగిట్స్ లభించాయి. ఈ ఆదాయం 15 రోజుల్లో (జనవరి 19 నుంచి ఫిబ్రవరి 3 వరకు) సమకూరింది. ఏఈవోలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి, హరిమాధవరెడ్డి, హేమమాలిని, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, శ్రీనివాస్, యూనియన్ బ్యాంకు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.