ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో కనులపండువగా రథోత్సవం
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం రథోత్సవం కనులపండువగా జరిగింది. తొలుత యాగశాలలో తితిదే పాంచరాత్ర ఆగమ సలహాదారుల కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం రథంగ ప్రతిష్ఠ, రథాన్యాసం తదితర పూజలు...







